Site icon NTV Telugu

PM Modi: డిప్యూటీ సీఎం పవన్కి ప్రధాని మోడీ గిఫ్ట్.. ఏమిచ్చాడంటే?

Modi

Modi

PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుక అమరావతిలో పెద్దెతున్న జరుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ హాజరయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి ప్రధాని మోడీల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏర్పాటు చేసిన సభా వేదికపై ముఖ్య నేతలందరూ కూర్చొని ఉండగా.. ప్రధాని మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచారు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేసిన పవన్‌ కల్యాణ్‌.. అదేంటో తెలుసా?

దానితో ప్రధాని మోడీ ఎందుకు పిలిచారో తెలియని పవన్ కళ్యాణ్ హడావిడిగా ఆయన దెగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న చాక్లెట్ ను పవన్ కు ఇవ్వడంతో వేదికపై ఉన్న వారితో పాటు, సభ ప్రాంగణంలో ఉన్న వారి మధ్య నవ్వులు విరబూశాయి. మొదట మోడీ చాక్లెట్ ఇచ్చిన తర్వాత.. మొదట ప్రధాని, సీఎం చంద్రబాబు నవ్వారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ ను చూసి వారితో కలిసి ఆయన కూడా నవ్వేశారు. ఆ తర్వాత మోడీకి రెండు చేతులతో నమస్కరించి నవ్వుతూ తన కుర్చీలో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Exit mobile version