NTV Telugu Site icon

PM Modi: తేజస్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోడీ

Modi

Modi

బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ ప‌రిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజ‌స్‌ యుద్ధ విమానంలో ఆయ‌న ఓ ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని నేడు ఆయ‌న విజిట్ చేశారు. ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని మోడీ ప‌రిశీలించారు. తేజ‌స్ యుద్ధ విమానం త‌యారీ గురించి కూడా తెలుసుకున్నారు.

Read Also: D Raja: బీజేపీ హటావో… దేశ్ బచావో.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారు..!

తేజస్ యుద్ధ విమానంలో గాల్లోకి ఎగిరిన ప్రధాని నరేంద్ర మోడీ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేస్తూ.. తేజస్‌ యుద్ద విమానంలో నా ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశా.. ఈ అనుభవం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై, మన జాతీయ సామర్థ్యంపై నాకు చాలా నమ్మకాన్ని పెంచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నాలో నూతనమైన ఉత్సహం కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను ప్రస్తుతం త‌యారు చేస్తుంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తేజ‌స్ యుద్ధ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్లను హెచ్ఏఎల్ తయారు చేస్తోంది.