పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (శుక్రవారం) ఒకే రోజు మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. షెడ్యూల్ ప్రకారం, నదియా జిల్లాలోని కృష్ణానగర్, బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్ అలాగే, పుర్బా బద్దమాన్ జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధానమంత్రి ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందు కోసం ప్రధాని గురువారం నాడు సాయంత్రం కోల్‌కతా చేరుకున్నారు. కోల్‌కతా విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు మోడీ చేరుకున్నారు.. అక్కడే రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కోల్‌కతాలోని వివిధ రహదారులలో ట్రాఫిక్‌ను కూడా నియంత్రించారు.
Read Also: Sunrisers Hyderabad: ఆఖరి బంతికి వికెట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా?
కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా కోల్‌కతాలోని పలు రోడ్లపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ మూడు చోట్ల బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారు. వీటిలో బద్దమాన్‌లో ఉదయం 11 గంటల నుంచి తొలి బహిరంగ సభ, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కృష్ణానగర్‌లో, మూడో బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి బోల్‌పూర్‌లో జరుగుతుంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో రెండు రోజుల పాటు గడిపారు. ఇప్పటికే, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ ఇటీవల బెంగాల్‌లో పలుమార్లు పర్యటించారు.
