NTV Telugu Site icon

PM Modi: తెలంగాణకు నేడు ప్రధాని మోడీ రాక..

Pm Modi

Pm Modi

Lokshabha Elections 2024: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రానున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో.. అలాగే, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే, సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభతో మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Read Also: Loksabha Election 2024 : సార్ నేను ప్రెగ్నెంట్.. ఎలక్షన్ డ్యూటీ వద్దని లీవ్ అప్లై చేసిన ఉపాధ్యాయుడు

అయితే, బేగంపేట విమానాశ్రయం నుంచి LB స్టేడియం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్ విమానాశ్రయం – బేగంపేట్ ఫ్లైఓవర్ – గ్రీన్ ల్యాండ్స్ – యశోద హాస్పిటల్ – రాజ్ భవన్ – ఖైరతాబాద్ ఫ్లైఓవర్ – ఎన్టీఆర్ మార్గ్ – తెలుగు తల్లి జంక్షన్ – రవీంద్ర భారతి మార్గాలలో ట్రాఫిక్ మళ్లీంపు ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా, ఎల్బీ స్టేడియం – నాంపల్లి – బషీర్‌బాగ్ – బీజేఆర్ విగ్రహం – ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ – నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్ – లిబర్టీ – హిమాయత్‌నగర్ – అసెంబ్లీ – వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.