NTV Telugu Site icon

PM Modi : లవ్లీనా, నిఖత్ జరీన్ లను అభినందించిన ప్రధాని మోదీ..

Pm Modi

Pm Modi

దేశ రాజధానిలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు సాధించినందుకు గాను బాక్సర్లు నిఖత్ జరీన్, లావ్లీనా బోర్గోహైన్‌లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. నిఖత్ రెండవ ప్రపంచ టైటిల్‌ను సాధించిగా.. లవ్లీనా టోర్నమెంట్‌లో తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె అద్భుతమైన ఫీట్ కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ఆమె అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి.. బంగారు పతకాన్ని గెలుచుకోవడం పట్ల భారతదేశం సంతోషిస్తోంది అని PM మోడీ ఒక ట్వీట్టర్ లో రాసుకొచ్చారు.

Also Read : Bilkis Bano rapist: గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమం.. వేదికపై బిల్కిస్ బానో రేపిస్ట్

ఇక తెలంగాణ అమ్మాయి.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్‌కు అభినందనలు.. ఆమె ఒక అత్యుత్తమ ఛాంపియన్.. ఈ విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసింది అని ప్రధాని మోడీ మరో ట్వీట్‌లో రాశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జరీన్ మరియు లవ్లీనా బోర్గోహైన్ ఇద్దరూ భారత్‌కు స్వర్ణ పతకాలను గెలిచారు.

Also Read : IPL 2023 : జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..

50 కేజీల విభాగంలో జరీన్ స్వర్ణం సాధించగా, 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ ఎల్లో మెటల్‌ను కైవసం చేసుకుంది. వియత్నాంకు చెందిన న్గుయెన్ తీ టామ్‌తో జరిగిన ఫైనల్ బౌట్‌లో జరీన్ 5-0తో విజయం సాధించి, టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో స్వర్ణాన్ని అందజేసింది.. లావ్లినా బోర్గోహైన్ 5-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్‌, లావ్లినా బోర్గోహైన్ అభినందనలు.. వారు అత్యుత్తమ ఛాంపియన్స్.. ఈ విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసింది అని ప్రధాని మరో ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.