Site icon NTV Telugu

PM Modi: పుతిన్‌కు ప్రధాని మోడీ విషెస్‌

Putin

Putin

రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్‌-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మూడురోజుల పాటు జరిగిన ఎన్నికల్లో పుతిన్ భారీ విజయం సాధించారు. సుమారు 87 శాతం ఓటింగ్‌ సంపాదించారు. తాజా ఫలితంతో మరో ఆరేళ్ల పాటు రష్యాను పాలించనున్నారు. గత 24 ఏళ్లుగా అధికారంలో చెలామణి అవుతున్నారు. ఈ పదవీకాలం పూర్తయితే రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు.ఇటీవలే రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మృతిపై ఆయా దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. నావల్నీ హత్యకు గురై ఉంటారని అనుమానించారు.

ఇది కూడా చదవండి: Premikudu : ప్రేమికులారా గెట్ రెడీ.. ప్రేమికుడు మళ్ళీ వస్తున్నాడు!

ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లుగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవంతలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారు. భవిష్యత్‌లో పరిస్థితి ఇంకెలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే పశ్చిమదేశాలకు అణు హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌కు సహకరిస్తే.. అణు ప్రమాదం తప్పదని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా ప్రధాని మోడీ కూడా ఇండియాలో ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు.

Exit mobile version