PM Modi: తైవాన్ మృతులకు మోడీ సంతాపం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తైవాన్‌లో సంభవించిన భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బుధవారం తైవాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తైవాన్ ప్రజలు ధృడంగా ఉండాలన్నారు. తిరిగి వేగంగా కోలుకోవాలని.. మీకు సంఘీభావం తెల్పుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
భారీ భూకంపం తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘోర విపత్తు సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా గుర్తించారు. తైవాన్‌లోని హువాలియెన్ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది.
Also Read
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
ఈ భూకంపం కారణంగా పలు భవనాలు నేలకొరిగాయి. మరికొన్ని పగుళ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక వాహనాలు, రైళ్లు భారీ కుదుపులతో ప్రజలంతా బెంబేలెత్తిపోయారు. 1999 తర్వాత తైవాన్ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ భూకంపం కారణంగా దాదాపు తొమ్మిది మంది చనిపోయారు. 800 మంది గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Deeply saddened by the loss of lives due to earthquakes in Taiwan today. Our heartfelt condolences to the bereaved families and wishes for a speedy recovery to the injured. We stand in solidarity with the resilient people of Taiwan as they endure the aftermath and recover from…
— Narendra Modi (@narendramodi) April 3, 2024
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!