NTV Telugu Site icon

Parliament Sessions: “జీ20 సమ్మిట్‌.. భారత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సువర్ణావకాశం”

Pm Narendra Modi

Pm Narendra Modi

Parliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గతంలో అనేక బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారని ఆయన అన్నారు. పార్లమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌, సూపర్ స్టార్ కృష్ణకు సభ్యులు నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ రాజ్యసభ అధ్యక్షుడిగా మొదటి రోజు సభ నడపబోతున్నారని.. ఆయనకు ప్రధాని అభినందనలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. దేశ గౌరవాన్ని పెంచేలా సభలో చర్చలు జరగాలన్నారు.

శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్‌ ఆవరణలో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జీ-20కి అధ్యక్షత వహించే గొప్ప అవకాశం వచ్చిందని ప్రధాని వెల్లడించారు.

జీ20 సమ్మిట్‌ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదన్న మోడీ.. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశమని తెలిపారు. ప్రపంచానికి భారత్ అంటే ఏంటో సామర్థ్యాన్ని తెలుసుకునే సమయమన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలని… అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.

MCD Polls Results: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ, ఆప్ హోరాహోరీ

“పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం. పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలి. పార్లమెంట్‌లో యువ సభ్యులకు చర్చలకు అవకాశం ఇవ్వాలి. కేంద్రం ప్రతి అంశంపై చర్చ జరగాలని కోరుకుంటుంది. అన్ని పార్టీల నేతలు చర్చలకు సహకరించాలి..సమగ్ర చర్చ జరగకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. సభ్యులంతా పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలి.” అని ప్రధాని మోడీ కోరుకున్నారు.