18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీతో సహా కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మీడియాతో మాట్లాడుతూ మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పని చేస్తామని, మూడో దశ లో మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తామని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ, ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి విపక్షం అవసరం అని, ప్రజలు డ్రామాలు, ఆటంకాలు ఆశించట్లేదని, జనహితం కోసం విపక్షాలు సహకరించాలని సూచించారు.పూర్తి వివరాల కోసం కింద వీడియో చూడండి..
PM Modi: దేశానికి మంచి బాధ్యతాయుతమైన విపక్షం అవసరం(వీడియో)
- మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు
Show comments