Site icon NTV Telugu

Narendra Modi: దరువేసిన ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా..?

Modi

Modi

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ శ్రీరాముడి భక్తి గీతం పాడడంతో పాటు ఆ వీడియో గురించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ లోనూ, సోషల్ మీడియాలోనూ స్పందించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే, ఆ జర్మనీ గాయని తన తల్లితో కలిసి భారత్ కు రాగా.. వారిని ప్రధాని మోడీ కలిశారు.

Read Also: Chicken Price Hike : ఏపీలో కొండెక్కిన కోడి ధరలు.. కిలో ఎంతంటే?

ఇక, మంగళవారం నాడు తమిళనాడులోని పల్లడం దగ్గరప్రధాని మోడీని జర్మనీ సింగర్ కసాండ్రా మే స్పిట్ మాన్ సమావేశం అయ్యారు. ఆమె ‘అచ్యుతమ్ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపిస్తుండగా.. దానికి మోడీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు. అంతేకాదు, మధ్య మధ్యలో “వాహ్” అంటూ ఆమెను అభినందించారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జర్మనీ జాతీయురాలైన కసాండ్రా మే స్పిట్ మాన్ అనేక భారతీయ భాషల్లో భక్తి గీతాలు పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Exit mobile version