NTV Telugu Site icon

Amit Shah: ప్రధాని చంద్రయాన్‌ను ప్రారంభిస్తే.. సోనియా ‘రాహుల్‌యాన్‌’ను ప్రయోగిస్తున్నారు..

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

Read Also: Taiwan Minister: భారతీయులపై ‘జాత్యహంకార’ వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు

ఒకవైపు ప్రధాని మోడీ చంద్రయాన్ మిషన్‌ను ప్రారంభించారు. మరోవైపు సోనియాగాంధీ 20వ సారి రాహుల్ గాంధీని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె 19 సార్లు ‘రాహుల్-యాన్’ను ప్రయోగించారు, అన్నీ విఫలమయ్యాయి” అని జల్గావ్ ర్యాలీలో అమిత్‌ షా పేర్కొన్నారు. .తమ కుమారులు, కూతుళ్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని ఆయన ఇండియా కూటమి పార్టీలపై దాడి చేశారు. సోనియా రాహుల్‌ని ప్రధానిని చేయాలని, ఉద్ధవ్ (ఠాక్రే) తన కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయాలని, (శరద్) పవార్ తన కుమార్తెను ముఖ్యమంత్రిని చేయాలని, మమతా దీదీ తన మేనల్లుడిను ముఖ్యమంత్రిని చేయాలని, స్టాలిన్‌ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.” అని బీజేపీ నేత అమిత్‌ షా అన్నారు.

అమిత్ షా తన ప్రసంగంలో, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటులో తనను కలవడానికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిచోటా రక్తపాతం జరుగుతుందని చెప్పారని ఆయన అన్నారు. “రక్తం గురించి మరచిపోండి, గులకరాళ్లు కూడా విసిరేందుకు ఎవరూ సాహసించలేదు” అని అమిత్‌ షా తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. యువత తమ ఫ్రాంచైజీని వినియోగించుకునే ముందు సాధకబాధకాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు.‘బీజేపీకి ఓటేయడం అంటే యువత ఉజ్వల భవిష్యత్తు కోసం, గొప్ప భారతదేశాన్ని నిర్మించడం కోసం ఓటేయడం.. బీజేపీకి ఓటేయడం అంటే నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడం కోసం ఓటేయడమే’ అన్నారాయన.