PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN Rules: రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు.. పెట్టుబడి సాయంగా కూడా ఉపయోగ పడే విధంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని తీసుకొచ్చిన విషయం విదితమే.. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే.. ఒక్కోసారి రూ.2,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? వేర్వేరుగా భూమి రికార్డులు ఉంటే ఇద్దరూ ఈ పథకం ప్రయోజనం పొందవచ్చా? అనే సందేహాలు చాలామంది రైతుల్లో ఉన్నాయి.
24వ విడత విడుదల.. తదుపరి విడత ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. 2026 అక్టోబర్ 30న గుజరాత్లో పీఎం కిసాన్ పథకం 24వ విడత నిధులను విడుదల చేశారు. తదుపరి విడత 2027 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే తదుపరి విడత డబ్బులు ఎలాంటి ఆలస్యం లేకుండా పొందాలంటే రైతులు తమ అర్హతలను ముందుగానే పరిశీలించుకోవాలి. భూమి రికార్డులు సక్రమంగా ఉండటంతో పాటు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. బ్యాంకు ఖాతా వివరాలు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
Also Read
- Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
- Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
- Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
- Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
తండ్రి, కొడుకు ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా?
పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం రైతు కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు అని నిర్వచించారు. కేవలం తండ్రి, కొడుకుల పేర్లపై వేర్వేరుగా భూమి రికార్డులు ఉన్నంత మాత్రాన ఇద్దరూ విడివిడిగా పథకం ప్రయోజనం పొందలేరు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లపై సాగు భూమి ఉన్నట్లయితే వాటన్నింటినీ కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. ఒక రైతు కుటుంబానికి చెందిన సభ్యులందరి సాగు భూమిని కలిపినప్పుడు రెండు హెక్టార్లకు మించకూడదు. మొత్తం భూమి రెండు హెక్టార్లలోపు ఉంటే ఆ కుటుంబం పీఎం కిసాన్ ప్రయోజనం పొందేందుకు అర్హత ఉంటుంది. అయితే అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో అత్యధిక భూమి వాటా కలిగిన వ్యక్తి ఖాతాలోనే ఆర్థిక సాయం జమ చేస్తారు. అంటే తండ్రి, కొడుకు వేర్వేరు పేర్లపై భూమి కలిగి ఉన్నప్పటికీ ఒకే కుటుంబంగా పరిగణిస్తే ఇద్దరికీ విడివిడిగా రూ.6,000 చొప్పున అందుకునే అవకాశం ఉండదన్నమాట..
వేర్వేరు రైతు కుటుంబాలైతే ఇద్దరికీ డబ్బులు వస్తాయా?
ఒకే భూమిపై వేర్వేరు రైతు కుటుంబాలు భూమి యజమానులుగా నమోదై ఉన్న సందర్భాల్లో మాత్రం నిబంధనలు భిన్నంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తిగత భూమి విస్తీర్ణాన్ని పరిశీలిస్తారు. ఒక్కో కుటుంబానికి చెందిన సాగు భూమి రెండు హెక్టార్లు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, నిబంధనల ప్రకారం అర్హతను నిర్ధారించి ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంటుంది.
ఎవరు పీఎం కిసాన్‌కు అనర్హులు?
పథకం నిబంధనల ప్రకారం 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే అర్హత నిర్ధారణలో కుటుంబానికి చెందిన మొత్తం సాగు భూమిని పరిగణనలోకి తీసుకుంటారు. రెండు హెక్టార్లకు మించి సాగు భూమి ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలకు అనర్హులుగా పేర్కొన్నారు.
రైతులు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
పీఎం కిసాన్ పథకం తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ భూమి రికార్డులు, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకోవాలి. ముఖ్యంగా తండ్రి, కొడుకు పేర్లపై వేర్వేరు భూములు ఉన్నప్పుడు కుటుంబ అర్హత నిబంధనలను గుర్తుంచుకోవాలి. కేవలం భూమి రికార్డులు వేర్వేరుగా ఉన్నాయనే కారణంతో ఇద్దరికీ విడివిడిగా నగదు అందుతుందని భావించకూడదు.
తాజావార్తలు
-
IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!