ఎన్నికల కమిషనర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ఒక స్థానం ఖాళీ కానుంది. కొత్త చట్టం అమలుకు ముందు, సీఈసీ, ఈసీలను ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించనున్నారు.
Read Also: Paytm : పేటీఎం వల్ల జనాల కష్టాలు.. జేబు నింపుకుంటున్న కంపెనీలు
అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం ప్రకారం, ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ పరిశీలన కోసం న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ప్రధాన మంత్రి నామినేట్ చేసిన కేంద్రమంత్రితో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఈ ఎంపిక కమిటీలో భాగం కానున్నారు.
Read Also: Gold Price Today: బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
ఇక, సెర్చ్ కమిటీ ‘షార్ట్ లిస్ట్’ చేసిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకునే అధికారం సెలక్షన్ కమిటీకి ఉంటుంది. ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించే ఛాన్స్ ఉన్న కొద్ది రోజుల ముందు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉండగా.. అనుప్ చంద్ర పాండేతో పాటు అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్‌లుగా కొనసాగుతున్నారు.
Read Also: Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం
అలాగే, ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రధాని కార్యాలయంలో జరిగే సమావేశానికి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి హాజరవుతారు. ఈ ఎంపిక ప్రక్రియలో రెండు కమిటీలు పని చేయనున్నాయి. ప్రధాని నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీతో పాటు ముగ్గురు సభ్యులతో కూడిన రెండవ కమిటీ న్యాయ మంత్రి నేతృత్వంలో పని చేస్తుంది. ఇందులో ఇద్దరు కార్యదర్శి స్థాయి అధికారులు ఉండనున్నారు.