Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు.. అకౌంట్ లోకి డబ్బులు

Ttd

Ttd

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారికి మొక్కుల చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. అయితే తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్.. రీసైక్లింగ్‌ యంత్రంలో వ్యర్థాలు వేస్తే.. ప్రోత్సాహకంగా రూ.5 చెల్లించనున్నారు. తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు.

Also Read:Balakrishna : ఉదయభాను కూతుళ్లతో బాలయ్య మామ.. ఎంత క్యూట్ గా ఉన్నారో!

ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రంలో భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే ప్రోత్సాహకంగా ఐదు రూపాయిలు చెల్లించనున్నారు. భక్తులు యుపిఐ ద్వారా లాగిన్ అయితే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చెల్లింపు జరిగేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చార్ ధామ్ యాత్రలో ఈ యంత్రాలు ఏర్పాటు చేశారు. గంగలో ప్లాస్టిక్ బాటిల్స్ పడకూండా యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళే ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటులో భాగంగా టిటిడి విధానాలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. టిటిడి ఈ నిర్ణయంతో ప్లాస్టిక్ రహిత సమాజంలో భాగంగా మరో అడుగు ముందుకు వేసినట్లైంది.

Exit mobile version