NTV Telugu Site icon

T20: టీ20లో హైదరాబాద్ కుర్రాడికి చోటు.. వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన

T20

T20

వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్.. ఎట్టకేలకు టీ20ల్లో స్థానం దక్కించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఆడుతాడని పలువురు క్రికెటర్లు చెప్పారు. మరోవైపు కేకేఆర్ స్టార్ రింకూ సింగ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అలాగే పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. మరోవైపు ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌ను కూడా టీ20లకు ఎంపిక చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్ మార్ఫింగ్ ఫోటో.. ఛీ.. ఇంత దారుణమా

టీ20 సిరీసులో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చిన సెలక్టర్లు.. సీనియర్లు కోహ్లీ, రోహిత్ లను పక్కన పెట్టారు. ఈ ఏడాది ఆరంభంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన సంజూ శాంసన్‌.. మళ్లీ ఈ సిరీసుతో పునరాగమనం చేస్తున్నాడు. వన్డే జట్టులో కూడా అతనికి చోటు దక్కింది. అయితే రింకూ సింగ్, జితేశ్ శర్మను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్‌ను జట్టులోకి తీసుకోవడంపై కూడా షాకవుతున్నారు. ఆవేష్ ఇటీవలి కాలంలో పెద్దగా రాణించింది లేదు. అతని కన్నా శివమ్ మావిని తీసుకోవాల్సిందని అంటున్నారు. కివీస్‌తో సిరీస్‌లో మావి అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో కూడా ఆకట్టుకుంటున్నాడు.

Kishan Reddy: తెలంగాణ బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి కీలక సమావేశం

సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మంది బృందంలో ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు స్పిన్నర్లు, నలుగురు పేసర్లు ఉన్నారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్‌కు ఈ టీంలో చోటు దక్కడం గమనార్హం. అంతేకాకుండా ఫినిషర్‌ బాధ్యతలను సంజూ శాంసన్, అక్షర్ పటేల్ పంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

భారత్ టీం: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషణ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్.