Telugu Titans: విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్.. రెండడుగుల దూరంలో ప్రొ కబడ్డీ కప్!
- గత కొన్నేళ్లుగా తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన
- 12వ సీజన్‌లో నిలకడగా రాణిస్తోన్న టైటాన్స్
- ఫైనల్‌కు అడుగు దూరంలో టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గత కొన్నేళ్ల పేలవ ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్.. 12వ సీజన్‌లో నిలకడగా రాణిస్తోంది. వరుస విజయాలతో విజృంభిస్తున్న టైటాన్స్ ఈ సీజన్‌లో ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై 46–39తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫయర్-2కు మన తెలుగు టీమ్ అర్హత సాధించింది. ఈరోజు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. శుక్రవారం దబంగ్ ఢిల్లీతో జరిగే ఫైనల్లో తలపడనుంది.
Also Read: Cyclone Montha: అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలం.. లైట్‌హౌస్‌ని తాకుతున్న కెరటాలు!
Also Read
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ఎలిమినేటర్-3 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయాన్ లోహ్‌చాబ్ మెరుపులతో ఆరంభంలో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది.ఓ సమయంలో 13-9తో పట్నా ముందంజలో నిలిచింది. పుంజుకున్న తెలుగు టైటాన్స్ విరామ సమయానికి 22-20తో ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో టైటాన్స్ ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ముఖ్యంగా భరత్ హుడా రెచ్చిపోయాడు. భరత్ 23 పాయింట్స్ సాధించడంతో పట్నాకు అవకాశం లేకుండా పోయింది. అయాన్ 22 పాయింట్లతో పట్నాను గెలిపించడానికి చాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో టైటాన్స్ కోచ్ భావోద్వేగం చెందారు. అతడు కంటతడి పెట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టైటాన్స్ ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?