NTV Telugu Site icon

Pithapuram MLA Taluka : నెంబర్ ప్లేట్ పై ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’.. ఆ ఒక్క చోట కాకుండా ఎక్కడైనా అంటూ..

Pithapuram

Pithapuram

Pithapuram MLA Taluka : ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని అందుకు సంబంధించిన ” పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. ” అంటూ అనేక నెంబర్ ప్లేట్లు., కొన్ని స్టిక్కర్స్ వాహనాలపై కనిపించాయి. ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా బరిలో దిగిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అంతేకాదు కూడా ప్రభుత్వం ఏర్పడడంలో పూర్తి సహకారం అందించిన పవన్ కళ్యాణ్ కు ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను అప్పగించారు. అయితే ఎన్నికల సమయంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ.. కొందరు బైక్ నెంబర్లు ప్లేట్ల స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. అని రాసుకొని ఉన్న నేమ్ ప్లేట్లను ఉంచారు. అయితే ఎన్నికలు అన్ని పూర్తయిన కానీ ఇంకా ఆ నేమ్ ప్లేట్లు అలాగే ఉంచారు కొందరు.

Producer Niranjan Reddy- Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ తో నిరంజన్ సాహసం..!

ఈ విషయాన్ని గ్రహించిన ట్రాఫిక్ పోలీసులు ఈ విషయం కాస్త రూల్స్ ను ఉల్లంఘించడం కింద ఉన్నాయంటూ అలాంటి నేమ్ ప్లేట్ ఉన్న వారిపై చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై కూడా తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన సభలో స్పందించారు. అందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ చెడ్డ పేరు తీసుకురాకండి., పోలీసులు బైక్ ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏది అని అడుగుతే అది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పకండి.. నన్ను తిడతారు., అలాగే వన్ వే లో వెళ్తూ అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని అంటే ఎలా.. అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని., జన సైనికులకు ఆయన స్పష్టం చేశాడు. ఇలాంటి విషయాలు మనం చెప్పే స్థాయిలో ఉండాలి కానీ.. చట్టాలను మనమే పాటించకపోతే ఎలా అంటూ ఆయన కాస్త సరదాగానే జన సైనికులకు హిత బోధ చేశాడు.

Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్‌ ప్రకటన.. రియల్ భూమ్ @ పిఠాపురం..!

ఇకపోతే తాజాగా నెంబర్ ప్లేట్ బదులుగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసి ఉన్నావు నేమ్ ప్లేట్ ఉన్న స్కూటీని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఈ విషయంపై స్కూటీపై ఉన్న ఇద్దరికీ ట్రాఫిక్ పోలీసులు కాస్త ఫ్రెండ్లి గానే క్లాస్ పీకారు. నేపథ్యంలో వారు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని ., అక్కడ చూసి బండి నెంబర్ ప్లేట్ ఎక్కడ అని ట్రాఫిక్ పోలీస్ అడగగా వారు స్కూటీ డిక్కీ లోంచి అసలైన నెంబర్ ప్లేట్ తీసి పోలీసులకు చూపించారు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ లు ఆ యువకుల చేతితోనే స్కూటీకి నెంబర్ ప్లేట్ ను ఫిట్ చేయించారు. ఆ తర్వాత పోలీసులు వారిని ఇప్పుడు ఉన్నది కరెక్టా..? కనుక ఇది వరకు ఉన్నది కరెక్టా..? అని ట్రాఫిక్ పోలీసులు అడిగాడు. ఇలాంటివన్నీ వేయించుకోవడానికి బండి పై వేరే చోట చాలా ఖాళి ప్రదేశాలు ఉన్నాయి కదా అక్కడ వేయించుకుంటే సరిపోతుంది కదా.. మీరు పర్ఫెక్ట్ గా నెంబర్ ప్లేట్ మైంటైన్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఫ్రెండ్లీగా వారికి తెలియజేశారు. ఇలాంటి సీన్ మళ్లీ రిపీట్ చేయొద్దంటూ వారిని అక్కడ నుంచి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.