NTV Telugu Site icon

MLA Pendem Dorababu: బల ప్రదర్శనకు సిద్ధమైన ఎమ్మెల్యే దొరబాబు.. రాజకీయ నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

Mla Pendem Dorababu

Mla Pendem Dorababu

MLA Pendem Dorababu: అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పులు చిచ్చు రేపుతున్నాయి.. ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ముఖ్యంగా సీట్లు దక్కని సిట్టింగ్‌ల్లో కొందరు రగిలిపోతున్నారు.. ఏదో రకంగా తమ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ రోజు పిఠాపురంలో బల ప్రదర్శనకి సిద్ధమయ్యారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే.. తన నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నుంచి కేడర్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, మార్పులు చేర్పులలో భాగంగా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుత ఎంపీ వంగా గీతకు కేటాయించింది వైసీపీ అధిష్టానం.. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్న దొరబాబు.. తన బర్త్‌డే సాక్షిగా బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సమావేశంలో పొలిటికల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Read Also: OpenAI CEO: సామ్ ఆల్ట్‌మాన్ గురించి నమ్మలేని నిజం.. ఎవర్ని పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే ఫ్యూజులు అవుటే..

కాగా, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ్‌గా ఎంపీ వంగా గీతను నియమించింది వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం నుంచి బరిలో దిగుతారన్నమాట.. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పనిలో పనిగా ఇతర పార్టీల నేతలను కూడా కలిశారనే ప్రచారం సాగుతోంది.. హైదరాబాద్‌ వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారనే చర్చ సాగింది.. కానీ, ఆయన తోసిపుచ్చారు.. మొత్తంగా టికెట్‌ రాలేదని రగిలిపోతున్న పిఠాపురం ఎమ్మెల్యే.. ఇప్పుడు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడంతో.. పొలిటికల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది చర్చగా మారింది.