Site icon NTV Telugu

HYDRA: వేకువజామునే పని మొదలెట్టిన హైడ్రా..

Hydra

Hydra

HYDRA: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో శ్మశాన వాటికలపై జరిగిన అక్రమ కబ్జాలను తొలగించేందుకు అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నుంచే హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. పర్వతాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 1, 12లో ఉన్న ముస్లిం , క్రిస్టియన్ శ్మశాన వాటికలపై కొంతకాలంగా భూకబ్జాదారులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు నిర్వహించినట్లు సమాచారం. గత రెండు ఏళ్లుగా ఈ శ్మశాన భూములపై కొనసాగుతున్న ఆక్రమణలకు శాశ్వత full stop పెట్టే క్రమంలో, అధికారులు పక్కా పథకంతో కూల్చివేతలకు దిగారు.

Yoga Day 2025: యోగాసనాలు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు!

ఇటీవల మేడిపల్లి ప్రాంతంలోని సేజ్ స్కూల్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించారు. ఆయ‌న స్వయంగా శ్మశాన వాటికలను పరిశీలించి, అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆదేశాల మేరకు హైడ్రా సిబ్బంది శ్మశాన వాటికల్లో చేపట్టిన కూల్చివేత చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలు ఈ చర్యలను స్వాగతిస్తున్నారు. శ్మశాన భూములపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని అసలైన హక్కుదారులకే అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.

Trump: ‘గెట్ అవుట్’.. రిపోర్టర్‌పై ట్రంప్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..!

Exit mobile version