బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ మరియు నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పిప్పా ఈ సినిమా 1971 ఇండియా – పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది.ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ కు భారత్ సహకరించింది. ఈ పిప్పా చిత్రంలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించారు. ఈ చిత్రాన్ని రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. తాజాగా పిప్పా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.పిప్పా సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. యుద్ధంలో కెప్టెన్ బలరామ్ మెహతా చూపిన దేశభక్తి, పోరాట పటిమను ఈ సినిమాలో మేకర్స్ చూపించనున్నారు.
పిప్పా చిత్రంలో మృణాల్ ఠాకూర్, ప్రియాన్షు పైన్యులీ మరియు సోనీ రజ్దాన్ కూడా కీలకపాత్రలు పోషించారు. కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ ఎంతో అద్భుతంగా నటించారు..ఇండియా – పాకిస్థాన్ యుద్ధంలో గరీబ్‍పూర్ పోరు గురించి ఈ సినిమాలో కీలకంగా ఉండనుంది. బంగ్లాదేశ్‍కు స్వాతంత్య్రం రావడంలో ఈ యుద్దం ముఖ్య పాత్ర పోషించింది.పిప్పా సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఆర్ఎస్‍వీపీ బ్యానర్‌పై రోనీ స్క్రీవాలా మరియు రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు..ఇటీవలే పిప్పా ట్రైలర్ వచ్చింది. “మనం సైనికుల్లానే తలపడాలి. సైనికుల్లాగే చంపాలి. సైనికుల్లాగే చావాలి” అనే లాంటి డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మొత్తం చాలా సిరీయస్‍గా ఎంతో ఆసక్తికరంగా సాగింది.
