NTV Telugu Site icon

Ap High Court: పిన్నెల్లికి హైకోర్టు షాక్.. ఏం చెప్పిందంటే..

New Project (21)

New Project (21)

ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ రోజున మాచర్ల వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు తెలిపింది. ఈవీఎం (EVM) ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలంది. కౌంటింగ్ కేంద్రానికి‌ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఈ‌ కేసు‌ విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని పిన్నెల్లి కి సూచించింది. సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని వెల్లడించింది. పిన్నెల్లి పై పూర్తి స్థాయి నిఘా విధించాలని సీఈఓ, పోలీసు అధికారులుకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

READ MORE: Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..

కాగా..ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నిన్న విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా పిన్నెల్లికి మాత్ర కోర్టు షరతు విధించింది.