నిన్న జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర కారణాలు మీటింగ్లో తనపై చేసిన అసత్య ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరని, కొడంగల్ లో తమ పార్టీ అభ్యర్థి పై గెలిచి తీరాలని రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. పట్నం బ్రదర్స్ ను ఎదుర్కోలేకనే కుట్ర పన్నుతున్నారని, పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులు పెట్టి కొన్నారని ఆ పార్టీ నాయకులే ఆరోపించారన్నారు రోహిత్ రెడ్డి.
Also Read : Dasoju Sravan : అమిత్ షా బీసీ సీఎం నినాదంపై దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా.. ‘వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి తాండూరు నుంచే డబ్బులు వెళుతున్నాయి. రేవంత్ రెడ్డి కూసిన పిచ్చికూతులను ప్రజలు గమనిస్తున్నారు. తనపై భూకబ్జాల విషయంలో ఆరోపణలు వాస్తవం కాదు… తాను ఏ గుడిలోకైనా, మసీదులో కైనా వెళ్లి ప్రమాణం చేయమంటే చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి 2018లో ఎన్నికల అపెడబిట్ లో చూపించిన ఆస్తి వివరాలు 2019లో లోక్సభకు పోటీ చేసినప్పుడు చూపించిన ఆస్తి వివరాలు మూడు కోట్లు అదనంగా ఉన్నాయి… ఈ మూడు కోట్ల పైచిలుక డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో రేవంత్ రెడ్డి చెప్పాలి. అస్మత్ పెట్లో తాండూర్ కు చెందిన వ్యక్తి భూమి 1500 గజాలు ఉండగా బు యజమానిని బెదిరించి1200 గజలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మారిన వ్యక్తుల గురించి మొన్న చేసిన ఆరోపణపై క్షమాపణ చెప్తున్న. ప్రజలు ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారు ప్రచారంలో పాల్గొంటారు. తాండూరు కాంగ్రెస్ సీటును రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నాడు.’ అని రోహిత్ రెడ్డి అన్నారు.
Also Read : Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు