TTD Room Rents: టీటీడీ వసతి గదుల అద్దె పెంపుపై నిరసన గళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమల ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఏడుకొండలపై ఇప్పుడో వివాదం నెలకొంది. తిరుమలలో వసతి గదుల అద్దెను అమాంతం పెంచివేస్తూ టిటిడి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోది. టీటీడీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి నేతలు నిరసనకు దిగారు. తిరుమలలో భక్తుల వసతి గదుల రేట్లను టి.టి.డి పెంచడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో కలెక్టరేట్ ఎదుట బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నా చేపట్టారు.
టీటీడీ అధికారులు పెంచిన రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అవలంభిస్తున్న వైఖరి మానుకోవాలని నినాదాలు చేశారు. టీటీడీ చర్యలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట సోము వీర్రాజు బైఠాయించి నిరసన తెలియజేశారు. బిజెపి ఆందోళనతో రాజమండ్రిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
విశాఖలో జీవీఎల్ నిరసన
టిటిడి అద్దె గదుల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ కాలెక్టర్రేట్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆందోళన లో పాల్గొన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ టీటీడీ పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయల పట్ల చిన్న చూపు చూస్తుంది.ప్రజలు తమ కష్టాలను దేవుడు కి చెపుకోవడానికి తిరుమల వస్తే వారిని ఇబ్బంది పెడతారా? వసతి గదుల రేటు పెంచి తే భక్తులు ఎక్కడ వుంటారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. సామాన్యుల పై విపరీతంగా ఆర్ధిక భారం మోపడం బీజేపీ ఖండిస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తిరిగి తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
నిన్నటి వరకు సాధారణ భక్తులకు సైతం అందుబాటులో ఉండే విధంగా వందల్లో ఉండే గదులు..ఇప్పుడు వేల రూపాయలకు చేరిపోయాయి. అసలు కొండపై ఉన్న వసతి గదులు ఇప్పుడు ఖరీదుగా మారిపోయాయి. అసలు టీటీడీ ధార్మిక సంస్థా లేక వ్యాపార సంస్థా అనే అనుమానం కలుగుతోందని భక్తులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉంటుంటారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600రూపాయలు వసూలు చేసే వాళ్లు. కాని ప్రస్తుతం జీఎస్టీతో కలిపి 1000 రూపాయలకు పెంచేశారు.

ఇటు నారాయణగిరి రెస్ట్ హౌస్‌లో కూడా 1,2,3గదులను 150-250ఉండే అద్దెను జీఎస్టీతో కలిపి 1700రూపాయలకు పెంచారు. ఇక రెస్ట్ హౌస్‌లోని 4లోని ఒక్క గది అద్దె 750ఉండగా దానికి వెయ్యి రూపాయలు అదనంగా పెంచి 1700 చేశారు. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి 2200రూపాయలు, స్పెషల్ టైప్ కాటేజీల్లో 750రూపాయల గదిని 2800రూపాయలకు పెంచి భక్తులపై మోయలేని భారం మోపింది టీటీడీ. ఈ గదులను అద్దెకి తీసుకోవాలంటే అంతే మొత్తం డిపాజిట్ గా చెల్లించాలి. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను ఇలా నిలువు దోపిడీ చేయడం ఎంతవరకూ సబబు అంటున్నారు.
Read Also: Pumpkin Seeds: గుమ్మడి గింజలు మగవారు తింటే మామూలుగా ఉండదు
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!