గుమ్మడి కాయ విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి.ఇవి రుచికరంగా ఉంటాయి. అలాగే శక్తిని ఇస్తాయి.
గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంది. అది మన ఎముకల తయారీకి చాలా అవసరం. ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో అయితే ఈ విత్తనాలు షుగర్ లెవల్స్ ను తగ్గించేందుకు సహాయ పడతాయి. ఈ గింజలు తింటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది.
గుమ్మడి విత్తనాలను పురుషులు తరచుగా తీసుకుంటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చాలా మంది పనుల తో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు ప్రతి రోజు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకో వచ్చు.
హైబీపీని తగ్గిస్తాయి. ఈ గింజలు గుండెకు మేలు చేస్తాయి. నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బీపీ సమస్య ఉన్నవారు ఈ విత్తనాలను తింటే బీపీ ఇంకా తగ్గుతుంది, సమస్యలు వస్తాయి. కనుకలో బీపీ ఉన్నవారు కూడా ఈ విత్తనాలను తినరాదు.
కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి.
గుమ్మడికాయ విత్తనాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. కొందరికి ఇవి సమస్యలను కలగజేస్తాయి.