నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా మిర్రర్ ముందు నిలబడి క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేసింది.. అవి షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లో ఉన్నాయి..
మిర్రర్ సెల్ఫీ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. అద్దం ముందు నిలబడి, అద్దంలో మనల్ని మనం ఫోటో తీసుకోవడం..దాదాపుగా హీరోయిన్లు అందరూ మిర్రర్ సెల్ఫీలు దిగిన వారే. రష్మిక కూడా గతంలో దిగే ఉంటారు..అయితే… కొత్తగా మిర్రర్ సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు.. తాజాగా రష్మిక మందన్న కూడా మిర్రర్ సెల్ఫీ దిగింది.. ఆ ఫోటోలలో ఒక్కో ఫొటోకు ఒక్కో విధంగా ఎకస్ప్రేషన్స్ ఇచ్చింది.. సరైన మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నా..మీరు ఏం అంటారు? మిర్రర్ సెల్ఫీలు తీసుకోవడంలో నేను బెటర్ అయ్యానని అంటారా?’ అని అడిగారు. మీ సమాధానం ఏమిటో కామెంట్ చేయండి.. అంటూ రాసుకొచ్చింది.. మొత్తానికి ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో రష్మిక ఫ్యాన్స్‌లో ఫులు క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని రూమర్స్ వచ్చినా రౌడీ హీరో, రష్మిక మాత్రం స్పందించలేదు. ఇటీవల వీరిద్దరూ ఓ హోటల్‌లో తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు.. కానీ రీసెంట్ గా విడిపోతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.. ఇంతకీ అసలు ఏం జరుగుతుందో అని రష్మిక ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది..