Site icon NTV Telugu

Piaggio Electric Auto: పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 236KM రేంజ్

Piaggio Electric Auto

Piaggio Electric Auto

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లు, కార్లు, ఆటోలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తాజాగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. కంపెనీ రెండు కొత్త మోడళ్లను ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ అనేక అద్భుతమైన ఫీచర్లతో పాటు సూపర్ రేంజ్ తో తీసుకొచ్చింది.

Also Read:India-UK Trade Deal: ఇండియా-యూకే ట్రేడ్ డీల్.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయంటే..

పియాజియో ఏప్ ఇ-సిటీ అల్ట్రా

ఇది సరికొత్త ఏప్ ఈ-సిటీ అల్ట్రా ఎలక్ట్రిక్ ఆటో. ఇది 10.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 236 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 9.55 kW శక్తిని, 40 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 28% గ్రేడబిలిటీ, క్లైమ్ అసిస్ట్ మోడ్, 3 kW ఛార్జర్‌తో ఫాస్ట్-ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఇంటెలిజెంట్ టెలిమాటిక్స్, లైవ్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డిజిటల్ స్పీడోమీటర్‌ను కలిగి ఉంది.

Also Read:Asia Cup 2025: దుబాయ్ వేదికగా ఆసియా కప్.. ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్..

పియాజియో ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్

దీనిలో 8.0 kWh బ్యాటరీ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 174 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. దీనిలో అమర్చిన మోటార్ 7.5 kW పవర్, 30 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 19% గ్రేడబిలిటీ ఇచ్చారు. ఏప్ ఈ-సిటీ అల్ట్రా భారత్ లో రూ. 3.88 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. కంపెనీ కొనుగోలుదారులకు 5 సంవత్సరాల / 2,25,000 కి.మీ వారంటీని కూడా అందిస్తోంది. ఏప్ ఈ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ భారత్ లో రూ. 3.30 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు.

Exit mobile version