NTV Telugu Site icon

GHMC: లైగికంగా వేధించిన సూపర్ వైజర్.. పారిశుధ్య కార్మికులు ఆందోళన

Ghmc

Ghmc

హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమను మానసికంగా, లైగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు. తను చెప్పినట్లు వినకపోతే దూర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తన కొడుకు పెళ్లికి కూడా సెలవు ఇవ్వడం లేదంటూ ఓ కార్మికురాలు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Also Read : Modern Woman: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వాడొద్ధన్నందుకు భర్తను వదిలేసిన భార్య

పై అధికారులకు తమ సమస్యను చెప్పిన వాళ్లు పట్టించుకోవడం లేదని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి రోడ్డు పై బైటాయించి నిరసన చేశారు. సూపర్వైజర్ ను తొలిగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని డిమాండ్‌ చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తరచు మమ్మల్ని ఇలానే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత కార్మికులు ఆరోపించారు.

Also Read : Anasuya : అను ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..

అయితే పారిశుధ్య కార్మికుల ఆందోళనపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. సూపర్వైజర్ శ్రీనివాస్ ను వేరే చోటుకు బదిలీ చేస్తామని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ జ్యోతి భాయ్ చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మెడికల్ ఆఫీసర్ జ్యోతి బాధిత కార్మికులకు హామీ ఇవ్వడంతో పారిశుధ్య కార్మికులు ఆందోళన విరమించారు. గతంలోను పలువురు సూపర్ వైజర్స్ ఇలాగే పారిశుధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు పై అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మహిళ కార్మికులను వేధించే అధికారులపై నజర్ పెట్టారు.

Show comments