Site icon NTV Telugu

Harassment: మైనర్‌ బాలికపై అత్యాచారం.. 8 మంది అరెస్ట్

Harassment

Harassment

Harassment: రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఎన్ని కేసులు పెట్టినా.. శిక్షలు వేసినా మార్పు రావడంలేదు. తాజాగా విశాఖపట్నంలోని గోపాలపట్నంలో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంట్లో నుంచి అలిగి వచ్చిన మైనర్ బాలికను గోపాలపట్నం మెయిన్ రోడ్డులో కారెక్కించుకొని ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన అవసరం తీరిన తర్వాత ప్రహ్లాదపురంలో ఒక మహిళకు ఆ బాలికను అప్పజెప్పాడు ఆ నిందితుడు.

Read Also: Minister Srinivas Goud: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..

ఆ మహిళ మరో ముగ్గురు యువకులతో అత్యాచారానికి ప్రోత్సహించింది. అనంతరం విడిచిపెట్టడంతో ఆ బాలిక గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ అత్యాచార ఘటనలో మహిళతో పాటు మరో ఎనిమిది మందిని గోపాలపట్నం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ అత్యాచార కేసులో ఒక విలేఖరి కూడా ఉన్నట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం మైనర్ బాలిక కనపడటం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఆ బాలిక పాత గోపాలపట్నానికి చెందిన దళిత మైనర్ బాలికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version