Minister Srinivas Goud: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Srinivas Goud: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెస్టారెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు, భద్రతా సిబ్బంది టెన్షన్ పడ్డారు. అయితే కాసేపటి తర్వాత మంత్రి లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నిన్న (బుధవారం) ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. మార్గమధ్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పట్టణంలో పర్యటించారు. ఈ క్రమంలో కూనరం చౌరస్తాలో బీఆర్ఎస్ నేత నిర్వహిస్తున్న రెస్టారెంట్ కు మంత్రి వెళ్లారు. కొద్దిసేపటికి రెస్టారెంట్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ భవనం పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఎక్కారు మంత్రి. అయితే లిఫ్ట్ లో సామర్థ్యానికి మించి ఉండటంతో డోర్స్ క్లోజ్ అయిన తర్వాత తిరిగి తెరుచుకోలేదు. దీంతో లిప్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. కాగా లిప్ట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరుక్కుపోవడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రమించి లిఫ్ట్ తలుపులు తెరిచారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు లిఫ్ట్‌లోని వారందరూ బయటకు వచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి మాట్లాడుతూ లిప్ట్ లో సామర్థ్యానికి మించి ఎక్కడంతోనే సమస్య తలెత్తిందని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తను సురక్షితంగానే ఉన్నాని అన్నారు. సామర్థ్యాన్ని మించడంతో సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు. అక్కడి నుంచి మంత్రి తన కారులో చెన్నూరుకు బయలుదేరి వెళ్లారు.
Sengol History: ‘సెంగోల్’ రాజదండం ఎక్కడ ఉంది? పార్లమెంటులో పెట్టాల్సిన అవసరం ఏముంది?
Also Read
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!