NTV Telugu Site icon

Koneti Adimulam : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Koneti Adimulam

Koneti Adimulam

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఆరోపించింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ వెల్లడించింది. ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై నా ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడని బాధిత మహిళ పేర్కొంది. ఎమ్మెల్యే ఆదిమూలం నాకు పదేపదే ఫోన్‌ చేసేవాడని, లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని పెన్‌ కెమెరా పెట్టుకున్నానని బాధితురాలు తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను.. బాధితురాలు తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బాధితురాలు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు లేఖ రాసింది.

Best Teacher Awards: నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం..

‘నేను తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు భర్త గిరిబాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాలక్ష్మి, యువగళం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర్ సిక్స్, ధర్నాలు, నిరసనలు వంటి కార్యక్రమాలను అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశాను’ అని బాధితురాలు వివరించింది.

Dan Bilzerian with Girls: అబ్బబ్బబ్బ.. బాసూ..! ఒక్క రోజైనా నీలా బతకాలి.. అందమైన మోడల్స్.. లెక్కలేనంత డబ్బు..

Show comments