PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్‌పే సంస్థ ఫీచర్ ఫోన్లు (కీప్యాడ్ ఫోన్లు) ఉపయోగిచే వారి కోసం ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకునేలా PhonePe UPI 123Pay సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్, వేగవంతమైన డేటా కనెక్షన్ లేని మిలియన్ల మంది వినియోగదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ లావాదేవీలను చేరువ చేయడమే ఈ సర్వీస్ ప్రధాన లక్ష్యం. యూపీఐ 123Pay ద్వారా వినియోగదారులు నాలుగు రకాల చెల్లింపు మార్గాలను ఉపయోగించుకోవచ్చు.
IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్): ఒక నిర్దిష్ట టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి, ఐవిఆర్ సూచనలను అనుసరిస్తూ ఫోన్ నంబర్ ఆధారంగా లేదా పిన్ నంబర్ నమోదు చేసి క్షణాల్లో డబ్బులు పంపవచ్చు.
Also Read
- Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
యాప్ ఆప్షన్ (App-based): ఫీచర్ ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసిన ప్రత్యేక యూపీఐ యాప్‌ల ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
మిస్డ్ కాల్ ద్వారా (Missed Call): మర్చంట్ వద్ద ఉన్న నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, ఆ తర్వాత వచ్చే వాయిస్ కాల్లో పిన్ ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ప్రొక్సిమిటీ సౌండ్ చెల్లింపులు: సౌండ్ వేవ్ సాంకేతికతను ఉపయోగించి సమీపంలోని డివైజ్‌ల ద్వారా లావాదేవీలను పూర్తి చేయవచ్చు.
ఈ సర్వీస్ ద్వారా డబ్బులు పంపడమే కాకుండా, విద్యుత్ లేదా మొబైల్ రీచార్జ్ వంటి యూటిలిటీ బిల్లుల చెల్లింపులు చేయడం, బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం, యూపీఐ పిన్ మార్చుకోవడం లేదా కొత్తది క్రియేట్ చేసుకోవడం వంటి సేవలను కూడా సులభంగా పొందవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) , నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన UPI 123Pay ప్రాజెక్ట్‌లో భాగంగా ఫోన్‌పే ఈ ఫీచర్‌ను తన ఖాతాదారులకు మరింత అనుకూలంగా రూపొందించింది. ఇది అత్యంత సురక్షితమైనది, బహుళ భాషా మద్దతుతో వస్తుంది. కాబట్టి ప్రాంతీయ భాషల్లో కూడా సంభాషణలు విని సూచనలు పాటించవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!