Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు ప్రభాకర్‌రావు

Phone Tapping Case

Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని పోలీసులు కోరారు. ప్రభాకర్ రావు పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.

READ MORE: Al Qaeda Module Busted: అల్ ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్..

ఇదిలా ఉండగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు గత జూలై 15 (గత మంగళవారం)న మరోసారి సిట్‌ విచారణకు హజరయ్యారు. డీసీపీ విజయకుమార్‌, ఏసీపీ వెంకటగిరి ఆయనను సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు. రాత్రి 7.30 సమయంలో సిట్‌ కార్యాలయం నుంచి పంపించారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి.. మోసపూరిత విధానాలతో 618 మంది వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిన విషయంలో ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు నిశితంగా విచారించారు. ‘‘నక్సల్స్‌ సమాచారం కోసమంటూ, మావోయిస్టులతో సంబంధం లేని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ఎందుకు ట్యాప్‌ చేయించారు? మీరు అలా చేయడానికి కారణం ఏమిటీ?.. అది మీ సొంత నిర్ణయమా? లేక ఎవరైనా ఆదేశించారా? ’ అంటూ ప్రభాకర్‌రావుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ ప్రభాకర్‌రావు పెట్టిన లిస్టులోని 618 మందిలో దాదాపు 300 మంది వాంగ్మూలాలను సిట్‌ అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. ఈ వాంగ్మూలాలను ప్రభాకర్‌ రావు ముందు పెట్టి, వీరంతా మావోయిస్టులతో సంబంధం లేని వారే కదా? ఎందుకు మీరు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రభాకర్‌ రావు చాలా ప్రశ్నలకు సమాధానమివ్వలేదని, విచారణకు సహకరించలేదని.. ‘‘గుర్తులేదు.. తెలియదు’’ అనే సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది.

Exit mobile version