ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని పోలీసులు కోరారు. ప్రభాకర్ రావు పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల24న విచారణకు రావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితోపాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకరించారు. అదేరోజు పీఆర్వో మధు, పీఏ ప్రవీణ్ ల స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి నివాసానికి వచ్చిన సిట్ అధికారులు…