Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది? ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సిట్, తదుపరి చర్యలకు ముందడుగు వేస్తోంది.
Read Also: Road Accident: పశ్చిమ గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ముగ్గురు!
ఇక, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, తన వాంగ్మూలాల్లో పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లు ప్రస్తావించడంతో.. ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ పూర్తిస్థాయిలో రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
