Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT), ఇప్పుడు నేరుగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Nani : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు కానుకగా ‘ది పారడైస్’ బిగ్ సర్ప్రైజ్
అందిన సమాచారం ప్రకారం.. కేసీఆర్‌కు నోటీసులు అందజేసేందుకు సిట్ అధికారులు ఈరోజు సాయంత్రంలోగా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న సందేహాలు, ఆధారాలపై వివరణ కోరుతూ ఈ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
400% వాల్యూమ్ బూస్ట్, IP68+IP69 రక్షణ, 120Hz డిస్‌ప్లేతో బడ్జెట్ లో Vivo Y31d లాంచ్.. ధర ఎంతంటే.?
నోటీసులు అందిన వెంటనే, రేపు (శుక్రవారం) ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మాజీ సీఎంను విచారించాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
