Student Suicide: ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో 3వ ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ మరో ఆత్మహత్య వార్త సంచలనం రేపుతుంది. నెల రోజుల్లో ఇది ఆత్మహత్య ఘటన. ఇంతకు ముందు కొన్ని రోజుల్లోనే రెండు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన కాన్పూర్ ఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రియాంక అనే పీహెచ్‌డీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని.. ఘటనపై ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై ఏడీసీపీ వెస్ట్ ఆకాష్ పటేల్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 1 గంటకు ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎస్‌హెచ్‌ఓను బలగాలతో క్యాంపస్‌కు పంపించారు. ఫోరెన్సిక్ విభాగం ఆధారాలు సేకరిస్తేనే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయన్నారు. అదే సమయంలో విద్యార్థి మృతిపై తోటి విద్యార్థులు కూడా మౌనంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
కాగా.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నివాసి. విద్యార్థిని ప్రియాంక వయస్సు 29 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తేల్చారు. అయితే.. ఆమే 10 రోజుల క్రితమే కాన్పూర్ ఐఐటీలో పీహెచ్‌డీలో అడ్మిషన్ తీసుకుంది. ఇంతకుముందు డిసెంబర్ మూడో వారంలో ఒరిస్సాకు చెందిన రీసెర్చ్ ఫ్యాకల్టీ సభ్యురాలు డాక్టర్ పల్లవి.. జనవరి మొదటి వారంలో మీరట్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి వికాస్ మీనా క్యాంపస్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐఐటీ కాన్పూర్‌లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు.. పరిపాలనా అధికారుల పని తీరుపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదువుల ఒత్తిడిని ఎవరూ పరిష్కరించలేరని విద్యార్థులు అంటున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!