Site icon NTV Telugu

8 Vasanthalu Movie Update: మీరు త‌న‌ని రేపు చూస్తారు.. ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ పోస్టర్!

8 Vasanthalu Movie Update

8 Vasanthalu Movie Update

Phanindra Narisetti’s 8 Vasanthalu Movie Update: ‘ఫణీంద్ర నర్సెట్టి’.. ఈ పేరుకు పెద్దగా ప‌రిచ‌యం అక్కర్లేదు. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ రావడంతో ఫణీంద్ర పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మధురం షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫణీంద్ర, చాందిని చౌద‌రి చాలా ఫేమ‌స్ అయ్యారు. దర్శకుడిగా ‘మను’ అనే సినిమాను ఫణీంద్ర తీశాడు. బ్రహ్మానందం కొడుకు రాజా గౌత‌మ్‌ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

మను సినిమా అనంతరం ఫణీంద్ర నర్సెట్టి చాలా గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు 6 సంవ‌త్స‌రాల త‌ర్వాత ‘8 వసంతాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 8 వసంతాలు ఫ‌స్ట్ లుక్‌ను శుక్రవారం ఉద‌యం 11.07కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసి.. ‘మీరు త‌న‌ని రేపు చూస్తారు’ అని పేర్కొన్నారు.

Also Read: Miss You First Look: ‘మిస్ యూ’ ఫ‌స్ట్ లుక్ విడుదల.. సరికొత్తగా సిద్దార్థ్!

న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా 8 వసంతాలు మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎనిమిదేళ్లలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. ‘365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే.. ఒక వసంతం’ అని గతంలో రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు రేపు తెలియరానున్నాయి.

Exit mobile version