PG Medical : మెడికల్ విద్యార్థులకు శుభవార్త.. పీజీ మెడికల్ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కుల తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీజీ మెడికల్ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కుల తగ్గించినట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు వరంగల్ కాళోజి హెల్త్ యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నీట్’ కటాఫ్ స్కోర్ ను 25శాతం కేంద్రం తగ్గించింది. కటాఫ్ తగ్గడంతో కన్వీనర్, యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి మరో మారు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రకటించింది. కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు.. యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ మెడికల్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నేడు పీజీ మెడికల్ కన్వీనర్ అదే విధంగా యాజమాన్య కోటా సీట్ల దరఖాస్తుకు మరో ప్రకటన విడుదల చేసింది.
Also Read : Kavi Samrat Review: కవిసమ్రాట్ రివ్యూ (ఆహాలో)
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ 2022 పీజీ అర్హత కటాఫ్ స్కోరును 25 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్ అభ్యర్థులు 25 శాతం 201 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 15 శాతం 169 మార్కులు, దివ్యాంగులకు 20 శాతం 186 మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. కటాఫ్ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుండి నుండి 26వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అదే విధంగా యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి 27వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!