Site icon NTV Telugu

Petrol Crisis: ఆర్థిక సంక్షోభంతో.. అక్కడ పెట్రోల్ బంకులు బంద్

Pak

Pak

ఆర్థిక సంక్షోభానికి తాజా అడ్రస్‌గా మారింది పాకిస్తాన్‌.. ఆర్థిక సంక్షోభం అంటే.. ఒక దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, దేశ ప్రజలకు అవసరమైన నిత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితులకు చేరుకోవడం.. దాంతో మనం తినే, వినియోగించే అత్యవసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చుంటాయి. పాకిస్తాన్‌లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. రోజులు గడిచేకొద్ది పాకిస్తాన్ అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతోంది. అయితే, తాజాగా పెట్రోల్ బంకులను రెండు రోజుల పాటు ( జులై 22 నుంచి జులై 24 వరకు ) బంద్ చేస్తున్నట్లు పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం తెలిపింది.

Read Also: Samantha Break: ఏడాది రెస్ట్.. సమంతకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోవడంతో పాకిస్థాన్ కరెన్సీ విలువ రోజురోజుకు దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాక్ ‎లో లీటరు పెట్రోల్ 253 రూపాయలు.. కాగా డీజిల్ ధర 253.50 పైసలుగా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ పట్టుబట్టింది.

Read Also: Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..

అయితే, గత కొంతకాలంగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్.. పాక్ సర్కార్ కు పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ సర్కార్ కేవలం 2.4శాతం మాత్రమే మార్జిన్ ఇస్తుందని వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఇవాళ్టి నుంచి సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ (శనివారం) సాయంత్రం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ సంఘం ప్రకటించింది. ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసును నిలిపివేస్తున్నట్లు పెట్రోలియం అసోషియేషన్ సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్ తెలిపారు.

Exit mobile version