CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Price Hike: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. శనివారం మరోసారి ఇంధన ధరలను పెంచడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు పెరగగా, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. అలాగే సీఎన్జీ ధరను కిలోకు రూ.1 పెంచారు. గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఇంతకుముందు మే 15న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను ఒక్కోటి రూ.3 చొప్పున పెంచారు. ఆ తర్వాత మే 19న కూడా పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు వడ్డించారు.. తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.5 వరకు పెరిగాయి. సీఎన్జీ ధర కూడా రెండోసారి పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.64 నుంచి రూ.99.51కి చేరుకుంది. డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ.92.49కు పెరిగింది. ఇక సీఎన్జీ ధర కిలోకు రూ.81.09గా నమోదైంది.
Also Read
ఇంధన ధరల పెరుగుదలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని సూచించింది. ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తాత్కాలిక రద్దీ కనిపిస్తున్నప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా ఖర్చులపై పడే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!