NTV Telugu Site icon

KCR: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు..

Kcr

Kcr

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో తెలిపారు.

READ MORE: Crime News: వివాహేతర సంబంధం బయటపడుతుందని.. పక్కింటావిడపై హత్యాయత్నం!

“2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్, స్పీకర్‌ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్‌ చేపట్టలేదు. ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించాలి. కొత్త వారిని ఎంపిక చేసేలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చర్యలు తీసుకోవాలి. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్‌ వచ్చింది. శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉంది.” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్, స్పీకర్‌ కార్యాలయంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌లను చేర్చారు.

READ MORE: Champions Trophy 2025: క్యాచ్ డ్రాప్​ చేసినందుకు అక్షర్​కు ఆఫర్ ఇచ్చిన రోహిత్

READ MORE: Bomb Blast: బస్సుల్లో వరుస పేలుళ్లు.. అట్టుడికిన ఇజ్రాయెల్‌