Site icon NTV Telugu

Akhanda2 : అఖండ ప్రీమియర్ షో పై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషన్

Akhanda2

Akhanda2

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే నిన్న తెలంగాణ హైకోర్టులో అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ రేట్లు పెంచడం‌పై సవాల్ చేస్తూ లంచ్‌-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేయగా, సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు.  ఈ కేసును విచారించిన హైకోర్ట అఖండ 2 ప్రత్యేక ప్రదర్శనలు మరియు టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది.

Also Read : TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్స్.. రొమాంటిక్ రెబల్ సాబ్

కానీ అప్పటికి అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ సేల్ చేయడంతో యధావిధిగానే షోస్ ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో అఖండ 2 మేకర్స్ పై మరోసారి పిటిషన్ దాఖలైంది. అఖండ ప్రీమియర్ షో పై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని మరోసారి కోర్టు లో పిటిషన్ వేశారు విజయ్ గోపాల్. ఈ పిటిషన్ పై నేడు మధ్యాహ్నం 1.15కి విచారరించనుంది హై కోర్టు. పలు వాయిదాలు, వివాదాల అనంతరం థియేటర్స్ లోకి వచ్చిన అఖండ 2 కు రిలీజ్ తర్వాత కూడా వివాదాలు తప్పట్లేదు. ఈ రోజు మధ్యాహ్నం విచారనకు రాబోతున్నఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version