రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్పై ఉండగానే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను కూడా మొదలు పెట్టాడు డార్లింగ్. అయితే ఇటీవల వరుస షూటింగ్స్ తో బిజీ బిజిగా ఉన్న డార్లింగ్ కాస్త గ్యాప్ తీసుకుని బాహుబలి ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ వెళ్ళాడు.

అయితే జపాన్ లో భూకంపం వచ్చినట్టు నేపథ్యంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దర్శకుడు మారుతీ స్పందిస్తూ ప్రభాస్ సేఫ్ గానే ఉన్నారని చెప్పడంతో ఊపిరిపిలుచుకున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు తాజాగా రెబల్ స్టార్ లేటెస్ట్ ఫొటోస్ రిలీజ్ చేశారు

కూల్ గా అమ్మాయిలకు కలల రాకుమారుడిలా ఫ్లవర్స్ పట్టుకుని చైర్ లో కూర్చుని క్యూట్ స్మైల్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నాడు రెబల్ సాబ్

రెబెల్ సాబ్ రెబెల్ సాబ్.. రోమాంటిక్ రెబెల్ సాబ్.. వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్.. లుకింగ్ ఫర్ ద బ్రైడ్.. పాన్-ఇండియా నంబర్ వన్.. పాన్-ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ ప్రభాసేలే.. రెబల్ స్టార్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
