మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్ల పంటలలో జామ కూడా ఒకటి.. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జామ పంటకు తెగుళ్ల బెడదా కూడా ఎక్కువనే ఉంటుంది.. కాయలు పక్వానికి రాగానే దీని ఉదృతి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి.. నీటి తడులు తక్కువగా ఇవ్వాలి..పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చాలి. వీటిని పంట కాలంలో నెలకోసారి మార్చి దీని ఉద్ధృతిని తగ్గించవచ్చు. దీన్ని రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు..
ఇందుకోసం మిథైల్ యూజినాల్ 2మి.లీ మరియు మలాథియాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి ద్రావణం తయారు చేయాలి.. ఇందులో ఫ్లైవుడ్ మొక్కలను నానబెట్టి ప్లాస్టిక్ సీసాల్లో పెట్టి తోటల్లో అమర్చడం వల్ల పండు ఈగ ఉద్ధృతి తగ్గుతుంది. ప్లైవుడ్ మొక్కలను ప్లాస్టిక్ సీసాలో దారంతో వేలాడదీసిన సీసా అడుగున పులిసిన గంజిని ఉంచితే పండు ఈగ నుంచి నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు..ఇక ఈ ఈగ ఉదృతి మరీ ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 100గ్రా. బెల్లం లేదా పులిసిన గంజి, 5మి.లీ మలాథియన్ కలిపి మట్టి పాత్రల్లో పోసి తోటల్లో అమర్చి కూడా ఈగ తీవ్రతను తగ్గించవచ్చనని నిపుణులు చెబుతున్నారు..
తెల్లసుడి దోమలు.. ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. దీని నివారణకు రాత్రి సమయాల్లో జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి.. అప్పుడే ఈగల బెడద పూర్తిగా తగ్గుతుంది..
పిండినల్లి..చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసితెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు బదనికలు తోటలో విడుదల చేయాలి..
కాండం తొలిచే పురుగులు.. పురుగు చెట్ల మొదళ్లలోకి తొలుచుకుని పోయి విసర్జించిన పదార్థం రంధ్రాల్లో నిండి ఉంటుంది. కాబట్టి, రంధ్రాలను శుభ్రపరచి పురుగులను చంపాలి. ఆ తర్వాత రంధ్రాల్లో పెట్రోల్ లేదా కిరోసిన్ లో తడిపిన దూదిని ఉంచి తడి మట్టిని పెట్టాలి అప్పుడే పురుగులు నశిస్తాయి..