Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesara Garelu Recipe: ఉదయం పూట టిఫన్ గా లేదా సాయంత్రం వేళల్లో వేడివేడిగా తినడానికి “పెసర గారెలు” బెస్ట్ స్నాక్. సాధారణంగా వడలు, గారెలు అంటే శనగలు, బొబ్బర్లు లేదా అలచందలతో చేస్తుంటాం. అయితే ఒకసారి పెసలతో కూడా గారెలు తయారు చేసి చూడండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ గారెలు నూనె కూడా ఎక్కువగా పీల్చవు. చాలా సులభంగా తయారయ్యే ఈ పెసర గారెలు ఇంట్లో అందరికీ నచ్చే రుచికరమైన వంటకంగా మారుతుంది.
కావలసిన పదార్థాలు:
* పెసలు – 2 కప్పులు
* అల్లం – 3 అంగుళాల ముక్క
* పచ్చిమిర్చి – 6
* ఎండుమిర్చి – 4
* ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
* కరివేపాకు – కొద్దిగా (సన్నగా తరిగినది)
* కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
* జీలకర్ర – అర టీస్పూన్
* ఉప్పు – తగినంత
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
తయారీ విధానం:
ముందుగా పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. పెసలు పూర్తిగా నానకపోతే గారెలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. నానిన పెసలను మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొద్దిగా కచ్చా బచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే జార్లో నానిన పెసలు వేసి కొద్దిగా నీళ్లు జోడిస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు పిండిలో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు మరియు ముందుగా గ్రైండ్ చేసిన అల్లం-మిర్చి మిశ్రమం వేసి బాగా కలపాలి. తర్వాత చేతిని కొద్దిగా తడిపి చిన్న చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్, ప్లాస్టిక్ కవర్ లేదా అరటాకుపై వడల మాదిరిగా ఒత్తాలి. మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. కడాయిలో నూనె వేడి చేసి మధ్యస్థ మంటపై గారెలను ఒక్కొక్కటిగా వేయాలి. మొదట కిందకు అంటుకున్నట్లు కనిపించినా కొద్దిసేపటి తర్వాత అవే పైకి తేలుతాయి. మధ్య మధ్యలో తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
గారెలు బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించి కొద్దిగా ఉప్పు చల్లి సర్వ్ చేయవచ్చు. ఈ పెసర గారెలు ఎలాంటి చట్నీ లేకుండానే చాలా రుచిగా ఉంటాయి. కావాలనుకుంటే కొబ్బరి చట్నీ, టమాటో సాస్‌తో కూడా తినవచ్చు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ పెసర గారెలు సాయంత్రం టీతో పాటు తింటే అద్భుతంగా ఉంటాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!