Site icon NTV Telugu

Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!

Perni Nani

Perni Nani

Perni Nani: వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకునే వారు.. నిజం అయితే వేలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సిందని ప్రశ్నించారు. అప్పట్లో అర్జీలు తీసుకోవటానికి విశాఖకు వెళ్లామని చెబుతున్నారు, అయితే ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం విజయవాడలో కూడా అర్జీలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాజకీయ స్ట్రాటజీ కోసం ఏమైనా చేస్తారని మండిపడ్డారు.

నోవాటెల్ హోటల్ కు ఎందుకు వెళ్లారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడతానని, అమిత్ షాను “అమిత్ భాయ్” అని పిలిచేంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్న పవన్ కళ్యాణ్, నిజంగా విశాఖ ఉక్కు ప్లాంట్‌కి ఒక మైన్ అలాట్ చేయించవచ్చని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షా దగ్గర ఇంత చనువు ఉంటే ప్రజల అవసరాలను తీర్చలేరా అని ప్రశ్నించారు. 42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయించే ధైర్యం మీకుందా అని నిలదీశారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. కానీ, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఇద్దరు ఎంపీలతో చెలరేగి పోవచ్చుకదా అన్నారు.

Bigg Boss 9 : రెడీ అయిన బిగ్ బాస్ 9 హౌస్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి సామి..!

స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఒక మైన్ తెప్పించమని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రైతులకు యూరియా అందించమని కోరారు. యూరియా లేక రైతులు విలవిల్లాడుతున్నారని, గత ఐదేళ్లలో రైతులు ఇలా రోడ్డెక్కలేదని గుర్తు చేశారు. అప్పట్లో వచ్చిన ఎరువులు, విత్తనాలు టీడీపీ వాళ్లు అమ్ముకున్నారని విమర్శించారు. యూరియా కోసం మోడీ, అమిత్ షాలకు ఫోన్ చేయవచ్చుకదా అని ప్రశ్నించారు. మీటింగులలో అనవసరపు ఉపన్యాసాలు ఎవరికీ అవసరం లేదని, మీ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కినా పట్టించుకోవడంలేదని తీవ్రంగా విమర్శించారు.

న్యూట్రలిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్ అన్న మీరు ఇప్పుడు యూనివర్సలిస్ట్ అంటున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జనసేన కార్యకర్తలను సర్దుకోవాలని చెప్పే పవన్ కళ్యాణ్, నిజంగా మీరు సర్దుకున్నారా అని ప్రశ్నించారు. మీ అన్నయ్యను ఎమ్మెల్సీ చేసి, రేపు మంత్రిని చేస్తారని ఆరోపించారు. ఎక్కడికెళ్లినా జెండాలు మోపించడం తప్ప సర్దుకోవడం మీకు రాదని దుయ్యబట్టారు. నాదెండ్ల మనోహర్, దుర్గేష్‌లు మంత్రి పదవులు తీసుకోకుండా సర్దుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. చివరగా, మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో ఒకసారి చర్చించుకోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్!

Exit mobile version