Perni Nani: ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లడ్డూ వివాదంపై పేర్ని నాని ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కూటమి ప్రభుత్వం ముసుగులో నారా చంద్రబాబు ప్రభుత్వం ఉందని.. ఇంతకీ చంద్రబాబు, పవన్, మాధవ్, కేశవ్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.. లడ్డూ వివాదంపై తాజాగా మాజీ మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేశవ్ తన ఆర్థిక శాఖ గురించి, ప్రభుత్వ అప్పుల గురించి పట్టదు. ఆ శాఖను ఆయన నడుపుతారా.. చంద్రబాబు నడుపుతారా తెలియదన్నారు.. కెమికల్స్ కలిపి ఆవు నెయ్యి కలిపారని చెప్పిన కేశవ్.. తక్కువ ధరలకు నెయ్యి కొన్నారు కాబట్టి అది కల్తీ నెయ్యి అంటున్నారన్నారు.. వారి ప్రభుత్వంలోనే హర్ష్ డెయిరీని ఇన్స్పెక్షన్ చేసి అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని అప్రూవ్ చేశారని ఆరోపించారు. అక్టోబర్ 2018 మాకేం సంబంధం.. ఫిబ్రవరి 2019 మాకేం సంబంధం అన్నారన్నారు.. మరి మే 2019 లో కేబినెట్ ఎలా పెట్టారు? అని ప్రశ్నించారు. మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలో చాలా నిర్ణయాలు కూడా తీసుకున్నారు.. హర్ష్ ఫ్రెష్ డెయిరీ నుంచి 291 రూపాయలకు టీడీపీ కొనుగోలు చేసింది.. మరి ఇది భోలే బాబా డెయిరీ నే కదా? అని నిలదీశారు. 319, 329 తప్పన్నారు.. తాము రావటానికి రెండు నెలల ముందు 291కి వాళ్ళు ఎలా కొనుగోలు చేశారని చెప్పారు..
READ MORE: CM Revanth Reddy : వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
2014 – 19 మధ్య హర్ష్ ఫ్రెష్ డెయిరీ నుంచి కొన్నారు.. మీ ప్రభుత్వం సమయంలో మీ సొంత సంస్థ హెరిటేజ్ రేట్లు ఎలా ఉన్నాయో చెప్పే ధైర్యం మీకు ఉందా? అని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. “హెరిటేజ్ కంపెనీలో ప్రతీ ఆరు నెలలకు రేటు ఎలా ఉందో చెప్పండి.. ఎవరు అపచారం చేశారో.. ఎవరు హిందువో.. ఎవరు ఏంటో అర్థం అవుతుంది.. పవన్ ఉచ్ఛం.. నీచం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. పవన్ కళ్యాణ్ ఎన్ని మతాలు మారారు.. తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత ఒక అన్నయ్య మాట్లాడారు.. సనాతన హిందువు అని చెప్పుకునే పవన్, నాగబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి లేదు. జగన్ మీరు మా మతం జోలికి రావొద్దు అంటూ దిగజారి మాట్లాడారు.. మీ ప్రభుత్వం హాయంలో పెంటపాడులో తగలబడ్డ రథం ముద్దాయిని ఇప్పటి వరకు పట్టుకున్నారా? 250 ఆలయాలు ధ్వంసం చేశారని చంద్రబాబు మాట్లాడారు.. మీ హయంలో విజయవాడలో ఎన్ని ఆలయాలు ధ్వంసం చేశారు.. ఎంత నీచంగా ఆలయాలు, గర్భ గుడుల్లో విగ్రహాలు కూడా కూల్చివేశారు.. మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని పునః ప్రతిష్ట జేసింది జగన్ కాదా? పవన్ కళ్యాణ్ అయోధ్యకు యానిమల్ ఫ్యాట్‌తో తయారు చేసిన లక్ష లడ్డూలు సప్లై చేశారు.. దేశం మొత్తం తినిపించారు అని నీచంగా మాట్లాడారు.. పాలకమండలి సభ్యులు మహారాష్ట్రకు చెందిన సౌరభ్ గోరా, మైహోమ్స్ రామేశ్వరరావులు నెయ్యి వారే ఇచ్చి లడ్డూలు తయారు చేయించారు.. బూట్లు వేసుకుని దేవుడికి కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేసే చంద్రబాబు.. తల్లిదండ్రులు చనిపోతే జుట్టు కూడా ఇవ్వనివాడు హిందూ ధర్మాన్ని గౌరవించేవారు.. జగన్‌ను ప్రజల ద్వారా గెలవలేక నిందించటమే పనిగా పెట్టుకున్నారు.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెడుతుంది ఎవరు.. రాజకీయాల్లో పతనానికి పరాకాష్టలా ఇవాళ చంద్రబాబు, పవన్ మాట్లాడిన మాటలు..” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
READ MORE: Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!