Site icon NTV Telugu

Perni Nani Vs Pawan Kalyan: మాకు లేవా చెప్పులు..? రెండు చెప్పులు చూయించిన నాని..

Perni Nani

Perni Nani

Perni Nani Vs Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో చెప్పులు చూయించుకునే రాజకీయం నడుస్తోంది.. ఆ మధ్య నన్ను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. చెప్పు చూపించి మరీ వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే, ఇప్పుడు మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ తిరుగుతున్న లారీకి నారాహి అనే పేరు పెట్టాల్సిందని సెటైర్లు వేశారు.. రోజుకో రకంగా మాట్లాడుతూ వ్యూహం అంటాడని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పచ్చగా కళకళలాడటానికే పవన్ కల్యాణ్‌ వ్యూహమన్న నాని.. పవన్.. చంద్రబాబు చొక్కా ఎన్ని సార్లు పట్టుకున్నావు? ఎన్ని సార్లు మోడీ కోటు పట్టుకున్నావ్? లేటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నందుకు చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ అడిగారా? అని ప్రశ్నించారు.

ఇక్కడకు వస్తే వంగో బెడతాం అంటూ పవన్‌ కల్యాణ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు పేర్నినాని.. పవన్ కల్యాణ్‌ చెప్పులు చూపిస్తాడట.. మాకు లేవా చెప్పులు…? రెండు ఉన్నాయి.. మా పార్టీ ఆఫీసులో కూర్చుని చూపించాను.. ఏమయ్యింది? అని ప్రశ్నిస్తూ.. మీడియా సమావేశంలోనే తన రెండు చెప్పులను చూపించాడు పేర్నినాని.. చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబుతో జనసేన పార్టీ నడుపుతున్నారని చిన్న పిల్లలకు కూడా తెలుసన్న ఆయన.. చంద్రబాబు, జనసేన, బీజేపీ కలిపి ప్రభుత్వం నడిపారని.. అప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు? అని ప్రశ్నించారు. నేను వేసిన రోడ్ల పై నడుస్తున్నారని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు చెప్పినప్పుడు పవన్ ఎక్కడకు వెళ్ళారు? తెలంగాణ వాళ్ల చేత ఆంధ్రా కొడుకల్లారా అని చెప్పించుకున్న తర్వాత కూడా పౌరుషం రాకపోతే ఎలా అని పవన్‌ను ప్రశ్నించారు..

ఇక, కేసీఆర్ సంక నాకుతున్నది ఎవరు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని.. గులాబి జెండాను బ్యాక్ ప్యాకెట్‌లో పెట్టుకుని హైదరాబాద్ లో తిరుగుతున్న వ్యక్తి పవన్ అంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన.. హరీష్ రావు ఏపీ ప్రజలను విమర్శిస్తే వెనకేసుకుని వచ్చింది నువ్వు కాదా? జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పవన్ వి ఎన్ని సినిమాలు వచ్చాయి? ఈ నాలుగేళ్లల్లో కేవలం రెండు సినిమాలు వచ్చాయి మీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్లపై కమర్షియల్ పన్ను , వినోద పన్ను, జీఎస్టీ లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి పదవి ఏమైనా దానమా? ఇస్తే సంతోషంగా తీసుకుంటాడట.. ఇదేమైనా గోదానమా? భూదానమా? ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీట్ వస్తుంది అని హితవుపలికారు.. వ్యూహాలను, చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టలేవని పవన్‌కు సూచించారు.. టీడీపీ కోసం కొత్త డ్రామాలకు తెర తీశాడు అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.

Exit mobile version