NTV Telugu Site icon

Perni Nani: చంద్రబాబు ఎన్నో స్కామ్ లు చేశారు..

Perni Nani

Perni Nani

స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంకల్పంతో పని చేసిన, బలమైన, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతిలో చంద్రబాబు దొరికిపోయారని ఆయన తెలిపారు. 1977 నుంచి చంద్రబాబు స్కాములు చేశారన్న నానీ.. ఇన్నేళ్లూ పట్టుబడకుండా నక్కజిత్తుల స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని అన్నారు.

Read Also: Janvi Kapoor : ఆ స్టార్ హీరోతో మాత్రం నటించడానికి వీల్లేదని జాన్వీకి చెప్పిన బోనీ కపూర్?

చంద్రబాబుకి ప్రతీ వ్యవస్థలో తన మనుషులు, స్లీపర్ సెల్స్ లా ఉన్నారన్న మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. అవినీతికి పాల్పడుతూ.. సమాజానికి చంద్రబాబు నీతులు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15లో కూడా తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు ఓటుకు లంచం ఇస్తూ.. ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని తెలిపారు. ఆ కేసులో 10 ఏళ్ల పాటూ.. ఏపీ ప్రజలు అనుభవించాల్సిన హైదరాబాద్‌ని కేసీఆర్‌కి అమ్మేసి, చంద్రబాబు డ్రామా ఆడారు. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మాత్రం పాపం పండిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Nupur Sanon:పసుపు రంగు డ్రెస్ లో టైగర్ నాగేశ్వరావు హీరోయిన్

విద్యను నేర్చించే పేరుతో రూ. 371 కోట్లను చంద్రబాబు దొచేశారని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. ఈ కేసు ఒక తీగ మాత్రమే.. ఇంకా డొంకంత కదిలి తీరాల్సి ఉంది. ఖచ్చితంగా కదులుతుందని ఆయన అన్నారు. పవన్, లెఫ్ట్ పార్టీలు, పురంధేశ్వరి.. చంద్రబాబును కాపాడటమే పనిగా పెట్టుకున్నారని పేర్నినాని అన్నారు. నన్ను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు రెండు రోజుల ముందే ఎలా చెప్పారు.. సీఐడీ అరెస్ట్ చేస్తుందనే సమాచరం ఆయనకు ఉంది.. కాల్వ శ్రీనివాసులు, ఇతర నేతలంతా రాత్రంత్రా నంద్యాలలోనే ఎలా ఉన్నారని ప్రశ్నించారు. 3 గంటల పాటు బస్సు డోర్ కొడితే నిద్ర పోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబు ఎందుకు బయటకు రాలేదు.. స్కార్ జరుగలేదని ఎక్కడ ఎవరు చెప్పారు కానీ.. అరెస్ట్ మాత్రం అన్యాయం అంటారు ఇదేక్కడి వింత ప్రచారమో అర్థం కావడం లేదని పేర్నినాని అన్నారు.

Read Also: Nithya Menen: పెళ్లి కూతురు డ్రెస్ లో సందడిచేస్తున్న నిత్య మేనేన్

సీఐడీ అధికారులు నంద్యాల నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్తామంటే దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు.. కాన్వాయ్‌లో ఎందుకు వెళ్లారని పేర్నినాని ప్రశ్నించారు. దీన్ని కక్షసాధింపు అంటే ఎలా అని ఆయన నిలదీశారు. నంద్యాల నుంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా చంద్రబాబును విజయవాడకు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే పడని చంద్రబాబు.. సీఐడీ ప్రశ్నించినప్పుడు మాత్రం ఏమో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగ్స్ మాత్రం చెప్పారని పేర్నినాని సెటైర్ వేశారు.

Show comments