NTV Telugu Site icon

Perni Nani: రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే.. అది పవన్ కే వచ్చేది

Pawanoscar

Pawanoscar

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ రసకందాయంగా నడుస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఆస్కార్ ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ కే వచ్చే ఉండేది. మరో నామినేషన్ కూడా వచ్చి ఉండేది కాదు.హరిరామ జోగయ్య ను చూస్తే జాలేస్తోంది.పవన్ కళ్యాణ్ నెలలో రెండు రోజులే కదా ఇక్కడ ఉండేది. మిగిలిన రోజులన్నీ తెలంగాణలోనే ఏడుస్తావ్ గా. తెలంగాణ లో ఎందుకు ప్రశ్నించవు?? కేసీఆర్ ను ఎందుకు నిలదీయవు?? అని ప్రశ్నించారు పేర్ని నాని.

Read Also: Perni Nani : పవన్ నాలుకకు నరం లేదు.. ఏదైనా మాట్లాడతాడు

నిలకడ లేని పవన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి?? ధైర్యం ఉంటే మా ఉమ్మడి ప్రభుత్వం చేసిన పనులే మళ్ళీ చేస్తాం అని చెప్పండి. చంద్రబాబులో ఉన్న రాజకీయ నిబద్ధత కూడా పవన్‌కు లేదు. కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ ఏం చేశాడు?పవన్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయ్యింది?? అన్నారు పేర్ని నాని. ఇటు పవన్ పై తనదైన రీతిలో ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో అంబటి రాంబాబు పవన్ పై సెటైర్లు వేశారు. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకి తాకట్టుపెట్టడమే సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటున్న పవన్ ని జాతి క్షమించదు అన్నారు అంబటి రాంబాబు.

Read Also: Ys Sunitha Reddy: సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్… కీలక అంశాలు